ఐరన్‌ దొంగతనం: ఇద్దరు అనుమానితుల అరెస్ట్‌

- June 03, 2020 , by Maagulf
ఐరన్‌ దొంగతనం: ఇద్దరు అనుమానితుల అరెస్ట్‌

మనామా: బహ్రెయినీ పోలీస్‌, ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఐరన్‌ రాడ్స్‌ని దొంగిలించి, స్క్రాప్‌ రూపంలో వాటిని విక్రయిస్తున్న కేసుకు సంబంధించి వీరిని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. ఓ వీడియోలో వీరిద్దరి దొంగతనానికి సంబంధించిన విషయాలు వెలుగు చూశాయి. డమ్ స్టాన్‌ ప్రాంతంలోని ఓ ఇంటి బయట నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నార్తరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ చీఫ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. సెర్చ్‌ మరియు ఇన్వెస్తిగేషన్‌ ఆపరేషన్‌ స్థానిక పోలీసుల నుంచి జరిగిందనీ, ఈ విచారణలో నిందితుల ఆచూకీ దొరికిందని, వారిని అరెస్ట్‌ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com