అబుధాబి:ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో డిస్కౌంట్లు..
- June 04, 2020
అబుధాబి:ట్రాఫిక్ చలాన్లను నిర్ణీత సమయంలోగా చెల్లించాలని అబుధాబి పోలీసులు వాహనదారులకు సూచించారు. అబుధాబి పోలీస్ వెబ్ సైట్ ద్వారాగానీ, స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారాగానీ జరిమానాలను చెల్లించొచ్చని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా చలాన్లను చెల్లించేవారి కోసం మూడు రకాల డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 22, 2019కు ముందుగా విధించిన జరిమానాలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తే 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక జరిమానా విధించిన 60 రోజుల్లోగా ఫైన్లను క్లియర్ చేసుకుంటే 35 శాతం తగ్గింపు వర్తిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 22లోగా జరిమానా చెల్లిస్తే 25 శాతం డిస్కౌంట్ లభించనుంది. అలాగే గతంలో ప్రకటించిన విధంగానే బ్లాక్ పాయింట్స్ కూడా రద్దు చేయబడతాయి. అయితే..సీరియస్ కేసుల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ డిస్కౌంట్లు వర్తించవని కూడా పోలీసులు స్పష్టం చేశారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







