శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి-టీటీడీ
- June 05, 2020
తిరుమల:తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. 8 నుంచి రెండు రోజులు ప్రయోగాత్మకంగా దర్శనాలు మొదలవుతాయి. 11 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు, కంటైన్మెంట్ జోన్లలోని వారిని అనుమతించబోమని స్పష్టంచేశారు.
శ్రీవారి సర్వదర్శనం ఉదయం 7న్నర గంటల నుంచి మొదలవుతుంది. అంతకుముందు గంట సేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. రాత్రి 7న్నర వరకు శ్రీవారి దర్శనాలకు సామాన్యులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో మాత్రమే కాలినడక భక్తులకు పర్మిషన్ ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు అనుమతిస్తారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. అలిపిరి నుంచే తనిఖీలు, శానిటైజేషన్ చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దర్శనాల తర్వాత తీర్థం, శఠగోపం ఉండవు. శ్రీవారి పుష్కరిణిలోకి ఎవరినీ అనుమతించరు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు