సరిక్రొత్త థ్రిల్లర్ మూవీ “A” (AD ‌INFINITUM) టీజర్ విడుదల

- June 05, 2020 , by Maagulf
సరిక్రొత్త  థ్రిల్లర్ మూవీ “A” (AD ‌INFINITUM) టీజర్ విడుదల

పరిమిత  బడ్జెట్ తో నిర్మితమైన “A” చిత్రం. ఫస్ట్ లుక్ మరియూ  మోషన్ పోస్టర్ ల విడుదలతో ప్రేక్షకుల  అంచనాలను  పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు విడుదలైన టీజర్ చూస్తే ఖచ్చితంగా  ఈ చిత్రం సినిమా ప్రియులకు ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్  ప్రేక్షకులకు  అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది.

లెజెండరీ ఫిల్మ్‌మేకర్ సింగీతం శ్రీనివాస్‌ను తన ప్రేరణగా భావించిన దర్శకుడు యుగంధర్  ముని తన జట్టును కూడా అదేవిధంగా ఎన్నుకున్నారు. సినిమాటోగ్రాఫర్  ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల,  చిత్రం లోని అన్ని పాటలను  అనంత శ్రీరామ్ వ్రాయగా దీపు మరియూ పావని ఆలపించారు. 
తన తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న  3 విభిన్నమైన పాత్రలను పోషించాడు.  మళ్ళీరావా ; ప్రెషర్ కుక్కర్ సినిమా లలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన ప్రీతీ అశ్రాని ఈ చిత్రంలో హీరోయిన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com