షకీల సినిమాకు సెన్సార్ నుండి క్లీన్ యు సట్టిఫికెట్
- June 09, 2020
షకీల అంటే అశ్లీలతతో కూడిన సినిమాలే చేస్తుంది. కుటుంబ కథా చిత్రాలు చేయదనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించుకోవడం కోసం రూపొందిస్తున్న సినిమా ‘షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’. విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటిస్తున్నారు. సి.హెచ్.వెంకట్రెడ్డి నిర్మాత. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సాయిరాం దాసరి, నవ్యమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇప్పటికే చిత్రీకరణ. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ లో ఉన్న ఈ సినిమా నేడు సెన్సార్ బోర్డ్ ముందుకు వచ్చింది. అయితే సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.
అటు షకీలా సినీ ప్రస్థానంలో కానీ ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం “జగన్ అన్న” అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎటువంటి కట్లు, మ్యూట్లు లేవు, అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది, తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లోకి ఎక్కే సాయి రామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు. ఈ సినిమాకు సి.హెచ్. వెంకట్ రెడ్డి నిర్మిత. లండన్ గణేష్ సహా నిర్మాత. మధు పొన్నస్ సంగీత దర్శకులు. ఇప్పటికే ఆయన బాణీలు అందించిన పాటలు విడుదలయ్యాయి.
రెండు గంటల రెండు నిమిషాల వ్యవధిలో 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు.. సంపూర్ణంగా కుటుంబ కథా చిత్రం అని.. ఇది నేరుగా ఓ.టి.టి.లో విడుదల చెయ్యాలా లేక సినిమా హాల్ లో విడుదల చెయ్యాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సాయి రామ్ దాసరి తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు తెలుపుతాము అని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







