బంగ్లాదేశ్ ఎంపీపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు, అరెస్ట్ చేసిన కువైట్ పోలీసులు
- June 09, 2020
కువైట్ సిటీ:కొన్నేళ్ల క్రితం వరకు అతనో సాధారణ వ్యక్తి. బ్రతుకుదెరువు కోసం బంగ్లాదేశ్ నుంచి కువైట్ చేరుకున్నాడు. ఓ క్లీనింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజులు తర్వాత అతనే సొంతంగా ఓ క్లీనింగ్ కంపెనీ పెట్టుకున్నాడు. దాదాపు 20 వేల మందిని రిక్రూట్ చేసుకున్నాడు. కానీ రిక్రూట్ లో జరిగిన అవకతవకలు బయటపడటంతో అతన్ని హ్యూమన్ క్రింద అరెస్ట్ చేశారు. ఇదంతా కువైట్ చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చి కువైట్ లో అతిసాధారణమై జీవితాన్ని గడిపిన కాసి బబుల్ అనే వ్యక్తి అనతి కాలంలో కోటీశ్వరుడిగా మారిపోయాడు. చివరికి బంగ్లాదేశ్ పార్లమెంట్ లో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అయితే..ఆ తర్వాతే అతని పాపం వెంటాడింది. అతని క్లీనింగ్ కంపెనీలో పని చేసేందుకు వచ్చే వారి నుంచి 1000 నుంచి 3000 దినార్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం 11 వందల కోట్ల రూపాయలను వసూలు చేసిన కాసి బబూల్.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డాడు. ఎంపీగా గెలిచాడు. అయితే..మానవ అక్రమ రవాణా, అక్రమ మార్గాల్లో డబ్బు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







