కోవిడ్ 19పై పోరాటంలో ప్రభావశీల భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న యూఏఈ, భారత్
- June 11, 2020
యూఏఈ:కరోనాపై పోరాటంలో యూఏఈ, భారత్ నిర్మాణాత్మక సహకారం అందిపుచ్చుకుంటున్నాయి. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా పరస్పరం సహరించుకుంటున్నాయి. గతంలో అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కోవిడ్ 19పై పరస్పర సహాకారం, అంతర్జాతీయ సవాళ్లు, వైరస్ వల్ల కలిగే సంక్షోభంపై చర్చించి అంశాలకు లోబడి ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సహకారం కొనసాగిస్తున్నాయని యూఏఈ స్పష్టం చేసింది. ఈ ఇద్దరు నేతల చర్చల నేపథ్యంలోనే యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్ధుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ తాజా పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల దౌత్యవేతలు ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ కారణంగా ఎదురవుతున్న సవాళ్లు, ఒకరికొకరు అందించుకున్న సహాయక చర్యలు, వైరస్ ను ముందుగానే గుర్తించటంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటంపై చర్చించారు. అలాగే కోవిడ్ కారణంగా చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు.
కోవిడ్ 19పై యూఏఈ చేస్తున్న పోరాటానికి మద్దతుగా భారత్ తగిన సహకారం అదించిందని ఈ సందర్భంగా షేక్ అబ్ధుల్లా ప్రశంసించారు. యూఏఈలో వైరస్ ను అరికట్టేందుకు భారత్ పంపించిన మెడికల్ టీమ్స్ రోగులకు చికిత్స అందించటంలో విశేషంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. అలాగే కరోనా చికిత్సకు అవసరమైన మందులను, వైద్య సామాగ్రిని సరైన కాలంలో భారత్ తమకు అందించిందని ఆయన కీర్తించారు. మరోవైపు యూఏఈలోని భారత రాయబారి పవన్ కుమార్ మాట్లాడుతూ..భారత్ కు యూఏఈ సహాయ సహాకారాలను ప్రశంసించారు. ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు యూఏఈ విశేషంగా సేవలు అందించిందని, కరోనా వైరస్ బారిన పడిన వారు ప్రయాణం చేయకుండా సమర్ధవంతంగా చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. స్నేహపూర్వక సహకారంలో భాగంగా భారత్ కు 7 మెట్రిక్ టన్నుల వైద్య సామాగ్రిని యూఏఈ అందించిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







