అనుచరుడు మూవీ ప్రారంభం
- June 12, 2020
హైదరాబాద్:వెరీగుడ్ సినీ స్కూల్ పతాకంపైప్రభాకర్ ఇప్ప స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న మేసుజ్ ఓరియెంటెడ్ ఎంటర్ టైనర్ "అనుచరుడు". ఈ చిత్రం నేడు పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనది. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఛైర్మన్ బాల మురళి ,తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఆర్ కె గౌడ్ సంయుక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు వరకోటి, బీసీ సెల్ రాష్ట్ర సెక్రటరీ రిషి కుమార్, లిరిక్ రైటర్ రామారావు, సంగీత దర్సకుడు సాయి శ్రీనివాస్ ,ఆర్టిస్ట్ చిట్టిబాబు,డాన్స్ మాస్టర్ బండ్ల రామారావు ,కెమెరా మాన్ వెంకట్ తదితరులు పాల్గున్నారు .
ఈ సందర్భంగా RK గౌడ్ మాట్లాడుతూ మా సిద్ధిపేట వాస్తవ్యుడైన ప్రభాకర్ గతంలో సహచరుడు సినిమా తీసి 5 బాషలలో రిలీజ్ చేసాడు. ఇప్పుడు అనుచరుడిగా తెరంగేట్రం చేయనున్నారు.అతనికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది అని తెలియచేస్తున్నాను అని చెప్పారు.
హీరో ప్రభు మాట్లాడుతూ నన్ను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న TFCC చైర్మన్ RK గౌడ్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు .ఛాంబర్ గైడ్ లైన్స్ ని అనుసరించి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఎక్కడఏది శాశ్వతంకాదు అనే కాన్సెప్ట్ తో ఈచిత్రం నిర్మించ బడుతుంది .సబ్జెక్టు బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నేను అనే నమ్మకం తో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాను అని చెప్పారు
కాస్టింగ్: ప్రభు , గౌతమ్ రాజు ,రంగరాజు ,రేలంగి , చిట్టిబాబు ,గబ్బర్ సింగ్ గ్యాంగ్ ,తదితరు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా వెంకట్ కొవూరి,డాన్స్ బండ్ల రామారావు ,లిరిక్ రైటర్ :రామారావు ,కో-డైరెక్టర్ : ఈశ్వర్.దామూగట్ల ,నిర్మాణం :వెరీ గుడ్ సినీ స్కూల్ కథ - స్క్రీన్ ప్లే- దర్శకత్వం:ప్రభు ఇప్ప
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి