భారత్ లో 3 లక్షలు దాటిన కరోనా కేసులు..
- June 13, 2020
భారత్‌లో వైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రతి రోజు వేలాది మంది వ్యాధిబారిన పడుతున్నారు. ఇప్పటి వరకు 10 వేల వరకు నమోదైన కేసులు.. తాజాగా 11 వేలు దాటిపోయాయి. తాజాగా గడిచిన 24 గంటల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం నిన్న ఒక్కరోజే ఏకంగా 11,458 మందికి కొత్తగా కరోనా సోకింది. 386 మంది మరణించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి.
కాగా తాజా గణాంకాలతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 3,08,993 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. వీరిలో 8,884 వైరస్ కాటుకు బలయయారు. దాదాపు 1,54,330 మంది కోలుకోగా.. ఇంకా 1,45,779 మందికి ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10 రోజుల క్రితం వరకు 2 లక్షలు ఉన్న కేసులు కేవలం అతి తక్కువ సమయంలోనే 3 లక్షలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 101,141, ఢిల్లీ 36,824, తమిళనాడు 40,000, గుజరాత్ 22,525 మందికి కరోనా సోకిందని తాజా లెక్కలు తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..