టూరిస్ట్‌ ఎట్రాక్షన్స్‌లో షేక్‌ మొహమ్మద్‌ పర్యటన

- June 13, 2020 , by Maagulf
టూరిస్ట్‌ ఎట్రాక్షన్స్‌లో షేక్‌ మొహమ్మద్‌ పర్యటన

యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్, దుబాయ్‌లోని పలు టూరిస్ట్‌ ఎట్రాక్షన్స్‌లో పర్యటించారు. అక్కడి సౌకర్యాల్ని పరిశీలించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో కొన్ని రోజులపాటు టూరిస్ట్‌ ఎట్రాక్షన్స్‌ మూసివేసిన దరిమిలా, ఇటీవల సడలింపుల తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల్ని పరిశీలించారు షేక్‌ మొహమ్మద్‌. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. జుమైరా అంతటా ఆయన పర్యటించారు. బీచ్‌లో ఏర్పాట్లనూ పరిశీలించారు. కాగా, దుబాయ్‌లో కేఫ్‌లు, రెస్టారెంట్‌లు, జిమ్ లు, పార్కులు మరియు షాపింగ్‌ మాల్స్‌ని ఇటీవల పునఃప్రారంభించిన విషయం విదితమే. జీవితం కొనసాగుతూనే వుంటుంది.. జీవితంలో ఓ ఫేజ్‌ ముగిశాక ఇంకో ఫేజ్‌ ప్రారంభమవుతుందని తెలుసుకున్నాను.. అంటూ షేక్‌ మొహమ్మద్‌ సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com