స్విమ్మింగ్ పూల్స్ వద్ద చిన్నారుల్ని ఒంటరిగా వదలొద్దు
- June 13, 2020
అబుధాబి అథారిటీస్, చిన్న పిల్లల్ని పూల్స్ మరియు హాట్ టబ్స్ వద్ద ఒంటరిగా వదలరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల విషయంలో అజాగ్రత్త వహించరాదని అబుధాబి పోలీస్ ఈ మేరకు హెచ్చరించారు. స్విమ్మింగ్ పూల్స్ అలాగే హాట్ టబ్స్ దగ్గరకు పిల్లలు రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు పోలీసులు. క్షణాల్లోనే పిల్లలు నీట మునిగే ప్రమాదం వుంటుందనీ, తల్లిదండ్రుల నిర్లక్ష్యమే చాలా ప్రమాదాలకు కారణమవుతాయని అబుధాబి కమ్యూనిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అలి అల్ జబెరి చెప్పారు. ఫిక్స్‌డ్ లాడర్స్, ఫ్లోటింగ్ రింగ్స్, లైఫ్ జాకెట్స్ అందుబాటులో వుండేలా చూసుకోవాలని ఇళ్ళల్లో స్విమ్మింగ్ ఎక్విప్‌మెంట్‌ని ఏర్పాటు చేసుకునేవారికి సూచించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







