సౌదీ తూర్పు ప్రాంతంలో భారీగా ఆరోగ్య భద్రత నిబంధనల ఉల్లంఘనలు
- June 13, 2020
సౌదీ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా అధికారులు చేపడుతున్న తనిఖీల్లో ప్రజలు, భారీగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. తూర్పు ప్రాంతంలోని మున్సిపాలిటీల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో వందల సంఖ్యలో తనిఖీలు చేపట్టారు. అల్ నాయిర్ గవర్నరేట్ పరిధిలో అధికార బృందాలు మొత్తం 649 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 48 మంది కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించగా.. మాల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి జనం గుమికూడటం వంటి 75 కేసులు నమోదయ్యాయి. అలాగే కార్మికులు ఉండే చోట్ల కూడా పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ఉన్న ఘటనలు మూడు చోట్ల చోటు చేసుకున్నాయి. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. ఇదిలాఉంటే గడువు ముగిసిన 6,272 ఆహార పదార్ధాలను నాశనం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..