కువైట్:నిర్బంధ, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 12 మందిపై కేసు నమోదు
- June 13, 2020
కువైట్:కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న కొందరు మాత్రం వైరస్ ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణకు తప్పనిసరిగా నిర్బంధంలో ఉండాల్సిన 12 మంది వ్యక్తులు అందుకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 10 మంది కువైట్ కు చెందిన వారు కాగా..ఇద్దరు ప్రవాసీయులు ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఏడుగురు గృహనిర్బంధం ఉండాల్సి ఉంది. కానీ, వారు రూల్స్ పాటించకుండా పబ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతూ పట్టుబడ్డారు. మరో ఐదురుగు కర్ఫ్యూ రూల్స్ పాటించకుండా పట్టుబడ్డారు. ఇందులో ముగ్గురు కువైట్ క్యాపిటల్ లో పట్టుబడగా..ఒకరు హవల్లి, ముబారక్ అల్ కబీర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ 12 మందిపై కేసును నమోదు చేసిన అధికారులు తదుపరి న్యాయవిచారణకు తరలించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!