సుశాంత్ అంత్యక్రియలు పూర్తి..
- June 15, 2020
ముంబై:బాలీవుడ్ యువహీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అంత్య క్రియలు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దహన సంస్కారాలు జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో ప్రస్తుతం పలు లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సుశాంత్ అంత్యక్రియలకు అత్యంత సమీప బంధువులు, కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
సుశాంత్ పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో కూపర్ ఆస్పత్రి నుంచి నేరుగా వహన్ హాన్స్ శ్మశానవాటికకి తరలించారు. అంబులెన్స్ ముందు సీట్లో ప్రముఖ నిర్మాత, సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ కూర్చోగా, అతని కుటుంబ సభ్యులు నేరుగా శ్మశాన వాటిక దగ్గరకు చేరుకున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఆయన తండ్రితో పాటు మిగతా కుటుంబ సభ్యులు పట్నా నుంచి ఆదివారం మధ్యాహ్నమే ముంబై చేరుకున్నారు. కడసారి సుశాంత్ పార్థివదేహాన్నిచూసి ఆయన తండ్రి బోరున విలపించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







