షార్జా:విధుల పునరుద్ధరణకు వీలుగా 5000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా టెస్టులు
- June 16, 2020
షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధులకు హజరుకానున్నారు. సిబ్బందిలో 30 శాతం మంది ఆఫీసులకు రావాలని షార్జా మానవ వనరుల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది ఎంప్లాయిస్ కి టెస్టులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. విధులకు హజరయ్యే ఉద్యోగుల భద్రతతో పాటు ఆయా కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఐదు నిమిషాల్లోనే శాంపుల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టెస్ట్ ఫలితాలు 72 గంటల్లో వస్తాయని, నేరుగా ఉద్యోగి మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా పరీక్ష ఫలితాలను చేరుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







