కరోనా పాటల ఆల్బమ్ ను ఆవిష్కరించిన వి .వి .వినాయక్
- June 16, 2020
కరోనా రక్కసి కరాళ నృత్యాన్ని చూసి ప్రపంచ పటమే భయంతో వణికి పోతున్న నేపధ్యంలో ప్రజలను చైతన్యం చేసే లక్ష్యంతో రూపొందిన " కరోనా రక్కసి " అనే పాటల ఆల్బమ్ ను ప్రముఖ సినీ దర్శకులు వి .వి .వినాయక్ ఈనెల 16 వ తేదీన ఆవిష్కరించారు.
అభ్యుదయ సినీ దర్శకుడు " బాబ్జీ " రచించిన యీ పాటలను ప్రజా నాట్యమండలి గాయకుడు " లక్ష్మణ్ పూడి " ఆలపించారు. యువ సంగీత దర్శకుడు " ప్రేమ్ " స్వరాలను అందించారు.
ఈ సంధర్భంగా వి .వి .వినాయక్ మాట్లాడుతూ " కరోనా రక్కసి విభృంజన ను చూసి జనమంతా విపరీతంగా భయపడి పోతున్నారని, కానీ మనం చేయవలసినది భయపడడం కాదు, జాగ్రత్తలు తీసుకోవడం అని , యీ విపత్తు సమయంలో ఆర్ధికంగా బలంగా వున్న వ్యక్తులందరూ ఆర్ధికంగా బలహీనంగా వున్న పేద సాదలకు అండగా నిలబడి మానవత్వాన్ని చాటాలని పేర్కొంటూ, ప్రజలను చైతన్య పరిచేందుకై యీ పాటల ఆల్బమ్ ను రూపొందిన బాబ్జీ , లక్ష్మణ్ పూడి గార్లను అభినందించారు....!
దర్శక రచయిత బాబ్జీ మాట్లాడుతూ " సమాజం లో ఏ విపత్తు వచ్చినా స్పందించడం, ప్రజల పక్షాన నిలబడడం కళాకారుల బాధ్యత అని, ఆ బాధ్యత తోనే యీ పాటలను రూపొందించామని " అన్నారు.
ప్రజా నాట్యమండలి గాయకుడు , ఈ పాటల ఆల్బమ్ రూపకర్త లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ " లాక్ డౌన్ ఎత్తి వేసిన తరువాత ప్రజలలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని, ఎవరికి వాళ్ళు మాకు ఏమి కాదు అనే భావన తో బయట తిరుగుతున్నారని, అలాంటి జనాన్ని చైతన్యపరచడానికే యీ పాటలను రూపొందించామని " తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







