జులైలోనే అంతర్జాతీయ విమాన సేవల పై నిర్ణయం-పూరీ
- June 16, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా రోజు రోజుకి కోవిడ్-19 వైరస్ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నియంత్రణలను ఎత్తివేసే దిశగా వచ్చే నెలలో నిర్ణయం వెలువడుతుందని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పూరీ మంగళవారం పేర్కొన్నారు.
ప్రయాణీకులు, ఎయిర్‌లైన్స్ సహా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి పూరీ తెలిపారు. అంతర్జాతీయ విమాన సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని నిర్ధిష్టంగా తాను వెల్లడించలేనని చెప్పారు. కాగా ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాల సంఖ్యపై పరిమితులతో మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను అనుమతించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







