విజయవంతంగా గల్వాన్ నదిపై వంతెన నిర్మించిన భారత ఆర్మీ
- June 19, 2020
గల్వాన్ నదిపై వంతెన నిర్మాణాన్ని అడ్డుకోడానికి చైనా ఎన్ని కుయుక్తులు చేసినా ఫలించలేదు. చైనాపై భారత్ పైచేయి సాధించింది. గల్వాన్ నదిపై 60 మీటర్ల వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేనట్లు మన ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే తమ పప్పులేమీ ఉడకవని భావించిన చైనా.. దీన్ని అడ్డుకోడానికి లెక్కలేనన్ని కుట్రలు చేసింది. అయినాసరే మన ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఇంజనీర్లు ఏమాత్రం భయపడకుండా పనులు కంటిన్యూ చేయడంతో చివరి ప్రయత్నంగా ఈ నెల 14న దారుణానికి ఒడిగట్టింది. మన 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంది. తన పంతం నెగ్గించుకోడానికి చైనా ఎంతకైనా తెగిస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈ బ్రిడ్జి పూర్తికావడంతో గల్వాన్ లోయలో మన సైన్యం పట్టు సాధించడానికి వీలు చిక్కింది.
గల్వాన్ నదిపై బ్రిడ్జి ష్యోక్ నది, గాల్వన్ నది సంగమానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అటు పెట్రోలింగ్ పాయింట్ 14కు సమీపంలోని బైలీ వెంతెనకు తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్త వంతెన నిర్మాణానికి ముందు కాలి నడక వంతెన ఉండేది. దీనిపై నుంచి దాటడానికి సైనికులకు ఇబ్బందులు తప్పేవి కావు. ప్రస్తుతం కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించడంతో ఈజీగా గల్వాన్ లోయ ఆవలివైపు చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు గల్వాన్ నదీ ప్రాంతంతో పాటు డార్బుక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ వరకు ఉన్న 255 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారిని కూడా కాపాడుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







