తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

- June 19, 2020 , by Maagulf
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం ఒక్క రోజే 499 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 6,525కి పాజిటివ్‌ కేసులు చేరాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి 198 మందిని పొట్టన పెట్టుకుంది. అధికారులు లెక్కల ప్రకారం 2976 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 3352 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. రెండు రోజులుగా GHMC పరిధిలో 300 మార్కును కరోనా కేసులు దాటేస్తున్నాయి. ఇప్పటివరకు GHMC పరిధిలో 4526 కు కరోనా కేసులు చేరాయి. దీంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా కేసులూ భారీగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 50,569 కరోనా టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com