దోహా:ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు..నిబంధనలు పాటించని వారికి జరిమానా విధింపు
- June 20, 2020
దోహా:ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు..దేశంలో పలు ఆరోగ్య సేవా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం, కార్మికుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ కేంద్రాలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను, నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 65 ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో మూడు జనరల్ మెడికల్ కాంప్లెక్స్, 14 కంపెనీ క్లినిక్స్ లు, 48 ప్రాధమిక చికిత్స కేంద్రాలు ఉన్నాయి. అయితే..అధికారుల తనిఖీల్లో దాదాపు 81 ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని హెచ్చరించటంతో పాటు జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?