మైనర్ బాలికల ట్రాప్..అసభ్య ఫోటోలతో బ్లాక్ మెయిల్..సౌదీ యువకుడి అరెస్ట్

- June 20, 2020 , by Maagulf
మైనర్ బాలికల ట్రాప్..అసభ్య ఫోటోలతో బ్లాక్ మెయిల్..సౌదీ యువకుడి అరెస్ట్

రియాద్:మైనర్ బాలికలను ట్రాప్ చేసి తన అవసరాలు తీర్చుకొని..ఆ తర్వాత వారిని వేధిస్తున్న ఓ సౌదీ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మక్కా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌదీకి చెందిన ఓ యువకుడు మైనర్ బాలికలను ట్రాప్ చేసేవాడు.మాయమాటలు చెప్పి తన వలలో వేసుకునేవాడు. ఆ తర్వాత హద్దుల మీరి ప్రవర్తించేవాడు. ఆ సమయంలో వాళ్లను అశ్లీలంగా ఫోటోలు దించి..ఆ తర్వాత ఆ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవాడు. అడిగినవి ఇవ్వకపోతే ఫోటోలను బయటపెడతానని బెదిరించి వాళ్లను దోపిడి చేసేవాడు. అయితే..తన ఆరాచకాలను సోషల్ మీడియాలో తానే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మక్కా రిజినల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి న్యాయవిచారణకు తరలించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com