అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్ విడుదల
- June 21, 2020
ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతిరావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.
నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషాదగాథకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. ‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను’ అని వర్మ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మర్డర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్ లైన్ ఉంచారు. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి నిర్మాతలుగా ఉండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, మారుతి రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







