తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కరోనా కేసులు
- June 21, 2020
హైదరాబాద్:తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇక హైదరాబాద్లో అయితే కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోయాయి. GHMC పరిధిలో తాజాగా 659 కేసులు నమోదు అయ్యాయి. జనగామలో 34, మేడ్చల్లో 9, ఆసీఫాబాద్లో 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్గొండ, వికారాబాద్, వరంగల్, యాదాద్రిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ మొత్తం 7,802 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 3,861 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆదివారం 225 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3,731 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా సోకి ఇప్పటివరకూ మొత్తం 210 మంది చనిపోయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







