50 శాతం కెపాసిటీతో షార్జా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ
- June 22, 2020
షార్జా:షార్జాలో ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం కెపాసిటీతో ప్రారంభమయిన విషయం విదితమే. ఈ కెపాసిటీని 50 శాతానికి పెంచుతున్నారు. వర్కింగ్ అవర్స్‌ని కూడా క్రమంగా పెంచుతామని షార్జా ప్రభుత్వ మీడియా బ్యూరో వెల్లడించింది. ఖచ్చితమైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని కార్యాలయాల నిర్వహణ జరుగుతోందని అధికారులు తెలిపారు. సోషల్ డిస్టెన్సింగ్, తప్పనిసరి మాస్క్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగులు ఇంటి నుంచే పని నిర్వహించేలా కూడా అవకాశం కల్పించారు. 9వ గ్రేడ్ అంత కంటే తక్కువ వయసున్న పిల్లలు కలిగిన తల్లులు, ప్రెగ్నెంట్ మహిళలు, క్రానిక్ డిసీజెస్‌తో బాదపడుతున్నవారిని రిస్క్ గ్రూప్స్ కింద భావించి, వారికి ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు ఇచ్చారు. షార్జా హ్యామన్ రిసోర్సెస్ డైరెక్టరేట్ హెడ్ డాక్టర్ తారిక్ సుల్తాన్ బిన్ ఖాదిం మాట్లాడుతూ, వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఉద్యోగులకు ఓ గైడ్ అందించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







