యాక్షన్ హీరో విశాల్ చక్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్ విడుదల
- June 22, 2020
యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చక్ర`. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా కసాండ్ర నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మనోబాలన్, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే ఇతర పాత్రలలో నటిస్తున్నారు. కాగా కాసేపటి క్రితం `చక్ర` తెలుగు వెర్షన్‌కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు యాక్షన్ హీరో విశాల్. పవర్ఫుల్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా జూన్ 22 సాయంత్రం 5 గంటలకు `చక్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్ పేరుతో వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్.
విశాల్ సూపర్ హిట్ మూవీ `అభిమన్యుడు` తరహా బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో కొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ వీడియోలో విశాల్ పవర్ఫుల్ మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
యాక్షన్ హీరో విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర,మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి : బాలసుబ్రమన్యన్
సంగీతం: యువన్ శంకర్ రాజా
నిర్మాత: విశాల్
దర్శకత్వం: ఎం.ఎస్ ఆనందన్
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







