6 నెలల ఎంప్లాయ్మెంట్ బ్యాన్ తప్పించుకునేదెలా?
- February 02, 2016
యూఏఈ లేబర్ రెగ్యులేషన్స్‌కి సెప్టెంబర్‌లో విడుదల చేసిన డిక్రీ ద్వారా కొన్ని మార్పులు చేశారు. మినిస్ట్రీ ఆరు నెలల బ్యాన్ విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ వివరాలు వెల్లడించింది. పరస్పర అంగీకారంతో ఈ బ్యాన్ విషయంలో వెసులుబాట్లను వలసదారులు వినియోగించుకోవచ్చు. ప్రధానంగా మూడు సందర్భాల్లో చట్టం బ్యాన్‌ని అనుమతిస్తుంది. హై స్కూల్ సర్టిఫికెట్ కలిగి ఉండి, ఎంప్లాయీ స్కిల్ ఉన్న కార్మికుడైతే ఆరు నెలల సర్వీసు అవసరం లేదు. న్యాయ నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో లేబర్ బ్యాన్ ఉండదు.
అన్లిమిటెడ్ కాంట్రాక్ట్
అన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ కొరకు
ఇరు వర్గాల మధ్య పరస్పర అవగాహన ఉండాలి. అలాగే ఎంప్లాయీ హై స్కూల్ సర్టిఫికెట్ లేదా అంతకన్నా ఉన్నతమైన చదువు కలిగి ఉండాలి.
30 రోజుల నుంచి 30 రోజుల మధ్య నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. ఈ సందర్భంలో ఆరు నెలల సర్వీస్ అవసరం లేదు. అలాగే హైస్కూల్ సర్టిఫికెట్ అంతకు మించి హయ్యర్ క్వాలిఫికేషన్ అవసరం లేదు.
కార్మికుడి తప్పు లేకుండా యజమాని తొలగించినప్పుడు.
కాంట్రాక్ట్ ఒప్పందాలను యజమాని ఉల్లంఘించినప్పుడు. ఉదాహరణకు 60 రోజులపాటు జీతాలు చెల్లించనప్పుడు.
యజమాని సంస్థను మూసివేసినప్పుడు
కార్మికుడు యజమానిపై కోర్టును ఆశ్రయించడానికి అవకాశాలు:
1. చెల్లించని జీతం కోసం
2. మధ్యలో తొలగించడం, టెర్మినేషన్ కాంపన్సేషన్
3. కార్మికుడు తాను పొందవలసిన హక్కులను యజమాని నుంచి పొందలేనప్పుడు
లిమిటెడ్ కాంట్రాక్ట్ కొరకు
నిర్ధారిత కాలం అధిగమించిప్పుడు, తిరిగి దాన్ని రిన్యూ చేయనప్పుడు
ఇరు పక్షాల మధ్యా అవగాహన కుదిరినప్పుడు.
ఒక పక్షం 30 రోజుల నోటీసు ఇచ్చినప్పుడు. అలాగే, నష్ట పరిహారంపై అవగాహనతో ఇరు పార్టీలూ ఉన్నప్పుడు. నష్ట పరిహారం 3 నెలల గ్రాస్ చెల్లింపును మించకూడదు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









