తెలుగు ఐక్యం సేవా కార్యక్రమం

- February 02, 2016 , by Maagulf


పేద విద్యార్థులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది ఓ అద్భుత కార్యక్రమం. 67వ రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి మండలంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో తెలుగు ఐక్యం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, త్రో బాల్‌ వంటి క్రీడలు ఈ సేవా కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. లలితా శివకుమార్‌ యాదవ్‌, ప్రైజ్‌లు మరియు రిఫ్రెష్‌మెంట్స్‌ని స్పాన్సర్‌ చేశారు. అలాగే పి. శ్రీధర్‌ మరియు పి.మధు విద్యార్థులకు ఎగ్జామ్‌ ప్యాడ్స్‌, పెన్నులు మరియు బుక్స్‌ను స్పాన్సర్‌ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జి.అరుణ్‌కుమార్‌ మోటివేట్‌ చేసేలా మంచి స్పీచ్‌ ఇచ్చారు. ఫౌండేషన్‌ గురించీ, సామాజిక బాధ్యతలను చేపట్టడం గురించి ఆయన అద్భుతమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు ప్రిన్సిపల్‌ మురళీకృష్ణ, లలితా శివకుమార్‌ యాదవ్‌ మరియు తెలుగు ఐక్యం, తెలంగాణ స్టేట్‌ ఇన్‌ఛార్జ్‌ ఎల్లమెల్ల సంతోష్‌ ఇతర సభ్యులను అభినందిస్తూ, వారి సేవల్ని కొనియాడారు. టీఆర్‌ఎస్‌ నేత హనుమంతరావు, డాక్టర్‌ హరేకృష్ణ చంద్రశేఖరన్‌ ఫౌండేషన్‌కి అన్నివిధాలా సహకరిస్తామని, అలాగే విద్యార్థులకూ అవసరమైన సందర్భాల్లో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com