దుబాయ్:బస్ సర్వీసుల్లో నాణ్యత పెంచేలా స్మార్ట్ ఫ్లాట్‌ఫామ్..
- June 25, 2020
దుబాయ్:ప్రజా రవాణాను మెరుగు పరిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు దుబాయ్ రోడ్డు రవాణా అధికారులు. ఇందులో భాగంగా ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలాహాలు కోరుతూ ప్రతి బస్సు డిపోల్లోనూ ప్రత్యేకంగా ట్యాబ్‌లు ఏర్పాట్లు చేసింది. ఈ స్మార్ట్ సిస్టం ద్వారా బస్సు డ్రైవర్లు తమ ప్రయాణం తర్వాత ఏమైన లోటు పాట్లు ఉన్నా, కొత్త ఆలోచనలు, సలహాలు రోడ్డు, రవాణా అధికారులతో పంచుకోవచ్చు. డ్రైవర్ల సలహాలు ఆమోదయోగ్యంగా ఉంటే వాటిని అమలు చేసేందుకు వెనుకడబోమని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. స్ట్రాటజిక్ లక్ష్యాలను సాధించేందుకు, డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్మార్ట్ విధానంతో మెరుగైన ఆలోచనలను పంచుకునే వెసులుబాటు కలుగుతుందని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







