బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రెండవ ఛార్టర్డ్ ఫ్లైట్
- June 27, 2020
మనామా:శంషాబాద్ విమానాశ్రయానికి కరోనా వేళ అంతర్జాతీయ విమానయాన సంస్థల చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తున్నాయి. రెండవ ఛార్టర్డ్ ఫ్లైట్ బహ్రెయిన్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి చేరుకుంది.వివరాల్లోకి వెళ్తే...మనామా నుండి హైదరాబాద్ కు 282 మంది ప్రయాణికులతో విమానం గత రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది.గల్ఫ్ ఎయిర్ వైస్ రెండవ విమానం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయం సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.కరోనా కారణంగా బహ్రెయిన్ లో ఉపాధి కోల్పోయిన అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న వారిని తెలంగాణకు తరలించడం జరిగింది.గత నెల రోజులుగా అవిశ్రాంత కృషి చేసిన తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో లో భారత రాయబార కార్యాలయం సహకారంతో విశేష కృషి చేసిన తెలుగు కళా సమితి హరి బాబు(అధ్యక్షులు),నోముల మురళి(ఉపాధ్యక్షులు),ఎం బి రెడ్డి(జనరల్ సెక్రెటరీ), రాజ్ కుమార్(ట్రెజరర్),వంశీధర్(కల్చరల్ సెక్రటరీ),రమేష్(స్పోర్ట్స్ సెక్రెటరీ), ఫణి భూషణ్(మెంబర్షిప్ సెక్రెటరీ) మరియు తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు.
--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)



తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







