సౌదీ అరేబియాలోని ఆఫీసు నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలు..

- June 28, 2020 , by Maagulf
సౌదీ అరేబియాలోని ఆఫీసు నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలు..

సౌదీ అరేబియా:దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేటయంతో ఇక ప్రైవేట్ కార్యలయాలు కూడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. అయితే..ఆఫీసులు పున ప్రారంభం అవుతుండటంతో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని అఫీసుల యాజమన్యాలు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ. కోవిడ్ లక్షణాలు ఉన్న ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్ కి అనుమతించకూడదని, వారితో వర్క్ ఫ్రమ్ హోం చేయించుకోవాలని సూచించింది. కొత్త ఉద్యోగుల నియామకాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉద్యోగులకు ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలను ఏర్పాటు చేయాలని, అంతా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని కోరింది. కంపెనీలు తమ సంస్థ ప్రాంగణాలను పూర్తిగా క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని, తాగటానికి పేపర్ కప్ లనుగానీ, వ్యక్తిగత కప్పులను గాని వినియోగించుకోవాలని పేర్కొంది. పెన్నులు, పేపర్లు, స్టేషనరీ సామాగ్రి లాంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. ఆఫీస్, కంపెనీలలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. వీలైతే ఉద్యోగుల మధ్య పార్టిషన్ తరహా ఏర్పాట్లు చేయటం ఉత్తమమని ఆరోగ్య శాఖ సూచించింది. ఇక ఉద్యోగులు కూడా తమ జాగ్రత్తలో తాము ఉండాలని, తరచుగా సబ్బుతో 40 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలి, లేదంటే ఆల్కహల్ ఉన్న శానిటైజర్లతో 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com