కువైట్ లో ఘనంగా ప్రారంభమైన పి.వి శతజయంతి ఉత్సవాలు!!!

- June 29, 2020 , by Maagulf
కువైట్ లో ఘనంగా ప్రారంభమైన పి.వి శతజయంతి ఉత్సవాలు!!!

కువైట్:తెరాస NRI కువైట్ మరియు తెలంగాణ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా పి.వి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ, అపరచాణిక్యుడు పివి నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

మంత్రి KTR  ఆదేశాల మేరకు, NRI కో ఆర్డినేటర్, పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ మెంబర్ మహేష్ బిగాల పిలుపు మేరకు గల్ఫ్ దేశమైన కువైట్ లో పివి శతజయంతి  వేడుకలు నిర్వహించడం జరిగింది.ప్రపంచవ్యాప్తంగా పి.వి ని గౌరవించేలా 52 దేశాల్లో ఏడాదిపాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. 

ఈ కార్యక్రమంలో TRS NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ ముత్యాల, సురేష్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, రవి మరియు తెరాస, జాగృతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com