'డిక్టేటర్' గా రానున్న బాలయ్య...
- May 23, 2015
బాలయ్య అభిమానులంతా ఆయన 99వ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి లక్ష్యం, లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ...'నా 99వ సినిమా డిక్టేటర్ ని ఈ నెల 29న ప్రారంభించబోతున్నాం. డైరెక్టర్ శ్రీవాస్ నా దగ్గరకు మంచి కథతో వచ్చాడు. ఈరోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. వారితో పని చేయడం హ్యాపీగా ఉంది. కథ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ కొత్తదనాన్ని ఫీలవుతున్నాను. ఈ మధ్యే ఈరోస్ ప్రతినిధి సునీల్ లుల్లా, డైరెక్టర్ శ్రీవాస్ కలిసి మాట్లాడుకున్నాం. కోన వెంకట్, గోపీ మోహన్ అన్ని ఎలివెంట్స్ ఉన్న మంచి కథ అందించారు. రత్నం, శ్రీధర్ సీపానలు కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమాకు ఒక ఫ్రెష్ టీంతో కలిసి పని చేస్తున్నాను. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎంటర్టెన్మెంట్ అన్ని ఎలిమెంట్స్ తో యూనిక్ కాన్సెప్టుతో రూపొందనున్న ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది' అన్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఎండి సునీల్ లుల్లా మాట్లాడుతూ...బాలకృష్ణ, శ్రీవాస్ కాంబినేషన్లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. శ్రీవాస్ చెప్పిన కథ బాగా నచ్చింది. శ్రీవాస్ డైరెక్షన్ చేయడంతో పాటు ఈ సినిమాకి కో ప్రొడ్యూస్ చేయడం వల్ల సినిమా పక్కా ప్లానింగుతో సాగుతుంది. సినిమాను గ్రాండ్ లెవల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తాం. శ్రీవాస్ అన్ని విషయాలు తానే దగ్గరుండి చూసుకుంటారు. ఈ సినిమాను ఈ నెల 29న లాంచ్ చేయనున్నామని తెలిపారు. దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...'బాలయ్యతో పని చేయడం ఆనందంగా ఉంది. చాలా కాలంగా ఆయనతో చేయాలనుకుంటున్నాను. ఈరోస్ సంస్థ సౌత్ లో ప్రొడ్యూస్ చేస్తున్న తొలి సినిమా ఇదే. ఆ సంస్థతో మా వేధాశ్వ క్రియేషన్స్ బ్యానర్ తో నేను కోప్రొడ్యూసర్ గా పార్ట్ కావడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. బాలయ్య సపోర్టుతో నిర్మాతగా మారాను. బాలయ్య బాబును ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని విధంగా డిఫరెంటుగా ప్రజెంట్ చేస్తున్నాము. ఈ చిత్రానికి సంగీతం థమన్, కెమెరా శ్యామ్ కె.నాయుడు అందిస్తున్నారు. ఫైట్స్ రవి వర్మ, ఆర్ట్ బ్రహ్మకడలి, గౌతం రాజు ఎడిటింగ్ చేస్తున్నారు అని తెలిపారు. ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించనుంది. మరో హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. ఈ నెల 29న సినిమా లాంచ్ కానుంది అన్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







