కువైట్:జులై 9 నుంచి జ్లీబ్, మహ్బైల్లాలో లాక్ డౌన్ ఎత్తివేత
- July 03, 2020
కువైట్:మూడు నెలల తర్వాత జ్లీబ్, మహ్బౌల్లా, అల్ షుయౌఖ్ ప్రాంతాలకు లాక్ డౌన్ నుంచి విముక్తి కలగనుంది. ఈ మూడు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. ఈ నెల 9 ఉయదం 5 గంటల నుంచి కేబినెట్ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మూడు ప్రాంతాల్లో ప్రవాసీయులే ఎక్కువగా ఉంటారు. అయితే..కరోనాకు హాట్ స్పాట్ గా మారటంతో ఏప్రిల్ 6 నుంచి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఇదిలాఉంటే...కరోనా తీవ్రత ఇంకా అదుపులోకి రాకపోవటంతో వైద్యశాఖకు KD75 మిలియన్లను కేటాయిస్తున్నట్లు మంత్రిమండలి సమవేశంలో ప్రధాని ప్రకటించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన వ్యాక్సిన్, ఇతర మెడికల్ కిట్లను కొనేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ రంగంపై ఎలాంటి నెగటీవ్ ప్రభావం పడకుండా మానవ వనరులశాఖ కు KD240 మిలియన్లను కేటాయించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







