బెలూన్ లో అంతరిక్ష ప్రయాణం.!
- July 03, 2020అంతరిక్షం గురించి తెలుసుకోవాలని, అంతరిక్షంలో ప్రయాణం చేయాలని అందరికి ఉంటుంది. కానీ, కొందరే ఆ డ్రీమ్ ను సాధించుకోగలుగుతారు. ఒకప్పుడు కేవలం స్పేస్ పరిశోధకులు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉండేది. ఎప్పుడైతే స్పేస్ ఎక్స్ అనే సంస్థ స్పేస్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిందో అప్పటి నుంచే స్పేస్ లోకి సరదాగా వెళ్ళొచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, రాకెట్లు, స్పేస్ షటిల్స్ లో కాకుండా ఇప్పుడు బెలూన్ సహాయంతో స్పేస్ లోకి వెళ్లొచ్చని అంటోంది ఫ్లోరిడాకు చెందిన స్పేస్ పర్స్పెక్టివ్ అనే సంస్థ.
ఈ సంస్థ స్పేస్ షిప్ నెప్ట్యూన్ పేరుతో ఓ బెలూన్ ను తయారు చేసింది. ఈ బెలూన్ సహాయంతో అంతరిక్షంలోకి వెళ్లిరావొచ్చు. భూమి మీద నుంచి దాదాపుగా లక్ష అడుగుల ఎత్తు వరకు ఈ బెలూన్ ప్రయాణం చేస్తుంది. 8 మంది పర్యాటకులను తీసుకెళ్లే సామర్ధ్యం కలిగిన ఈ స్పేస్ షిప్ నెప్ట్యూన్ స్పేస్ లో 6 గంటలపాటు ప్రయాణం చేస్తుంది. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎలా ఉంటాయని తెలుసుకోవచ్చు. 6 గంటలపాటు స్పేస్ షిప్ నెప్ట్యూన్ లో ప్రయాణం చేయడానికి టికెట్ ధర 1,25,000 డాలర్లు ఉండే అవకాశం ఉందని స్పేస్ పర్స్పెక్టివ్ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!