దోహా మున్సిపాలిటిలో 129 ఆహార ఉత్పత్తి కేంద్రాల మూసివేత

- July 04, 2020 , by Maagulf
దోహా మున్సిపాలిటిలో 129 ఆహార ఉత్పత్తి కేంద్రాల మూసివేత

దోహా:నిబంధనలు పాటించని, పాడైన ఆహారం కలిగి ఉన్న దాదాపు 129 ఆహార కేంద్రాలను దోహా మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు అహార ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన మున్సిపాలిటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దోహా మున్సిపాలిటి పరిధిలో మొత్తం 15 వేల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. పాక్షికంగా పాడైపోయి అనారోగ్య కారకంగా మారిన అహారాన్ని ఉత్పత్తి చేస్తున్న 588 మందికి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అలాగే 490 అహార ఉత్పత్తి కేంద్రాలకు జరిమానాలు విధించామని అన్నారు. అలాగే వివిధ మాంసం ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. 10.5 టన్నుల పాడైపోయిన మాంసాన్ని గుర్తించి దాన్ని నాశనం చేశారు. అలాగే అనారోగ్యం కలిగించే స్థితిలో ఉన్న 1.3 టన్నుల చేప మాంసాన్ని కూడా నాశనం చేసినట్లు మున్సిపాలిటి అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com