హైదరాబాద్ లో స్వాదాద్రి రియల్ ఎస్టేట్ స్కాం ముగ్గురు అరెస్ట్
- July 04, 2020
హైదరాబాద్:స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ ఎండీ యార్లగడ్డ రఘు తో పాటు శ్రీనివాస్, మీనాక్షి అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల దగ్గర నుండి డబ్బులు వసులు చేసి ఆ డబ్బులతో భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నగరానికి చెందిన యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురిని నమ్మించి మోసం చేశారని సజ్జనార్ తెలిపారు. సుమారు మూడు వేల మంది మోసపోయినట్లు విచారణలో తేలిందన్నారు. ఇప్పటి వరకు 156 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తెలిపారు. ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
నగరానికి చెందిన యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అతని మాటలు నమ్మిన అనేకమంది పెద్ద మొత్తంలో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదంతా మోసమని గ్రహించిన ఓ బాధితుడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్‌లో ఏజెంట్ల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.




తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







