దేశం దాటకుండానే విజిట్ విసాను ఫ్యామిలీ వీసాగా మార్చుకునేలా ఒమన్ నిర్ణయం
- July 05, 2020
మస్కట్:విజిట్ వీసాతో ఇప్పటికే దేశంలో ఉన్న ప్రవాసీయులకు శుభవార్త తెలిపింది ఒమన్ ప్రభుత్వం. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల దృష్టిలో ఉంచుకొని దేశం దాటకుండానే విజిట్ వీసాను ఫ్యామిలీ వీసాగా మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు పాస్ పోర్ట్స్, రెసిడెన్స్ డైరెక్టరేట్ జనరల్ అధికారి స్పష్టం చేశారు. ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఒమన్ లో విజిట్ వీసాపై ఉన్న ప్రవాసీయుల కుటుంబాలకు ఫ్యామిలీ వీసా కింద బదిలి చేసుకొని ఒమన్ లోనే ఉండొచ్చు. ఒమన్ లో నివాస అనుమతి ఉన్న ప్రవాసీయుడి భార్యతో పాటు అతని పిల్లలకు ఫ్యామిలి వీసా ఇవ్వనున్నారు. అయితే..ఒమన్ నిర్ణయించిన నిర్ణీత వయస్సులోపు ఉన్న పిల్లలకు మాత్రమే ఫ్యామిలీ వీసా ఇస్తారు. అంతేకాదు..ఒమన్ కు తమ కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రవాసీయుడి జీతం RO300పైగా ఉండాలి. అలాగే ఇంటి కిరాయికి సంబంధించి అగ్రిమెంట్ ఉండాలి. దేశం దాటకుండానే విజిట్ వీసాను ఫ్యామిలీ వీసాగా బదిలి చేసుకునే వెసులుబాటు కల్పించటం ప్రవాసీయుల కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







