దేశం దాటకుండానే విజిట్ విసాను ఫ్యామిలీ వీసాగా మార్చుకునేలా ఒమన్ నిర్ణయం
- July 05, 2020మస్కట్:విజిట్ వీసాతో ఇప్పటికే దేశంలో ఉన్న ప్రవాసీయులకు శుభవార్త తెలిపింది ఒమన్ ప్రభుత్వం. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల దృష్టిలో ఉంచుకొని దేశం దాటకుండానే విజిట్ వీసాను ఫ్యామిలీ వీసాగా మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు పాస్ పోర్ట్స్, రెసిడెన్స్ డైరెక్టరేట్ జనరల్ అధికారి స్పష్టం చేశారు. ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఒమన్ లో విజిట్ వీసాపై ఉన్న ప్రవాసీయుల కుటుంబాలకు ఫ్యామిలీ వీసా కింద బదిలి చేసుకొని ఒమన్ లోనే ఉండొచ్చు. ఒమన్ లో నివాస అనుమతి ఉన్న ప్రవాసీయుడి భార్యతో పాటు అతని పిల్లలకు ఫ్యామిలి వీసా ఇవ్వనున్నారు. అయితే..ఒమన్ నిర్ణయించిన నిర్ణీత వయస్సులోపు ఉన్న పిల్లలకు మాత్రమే ఫ్యామిలీ వీసా ఇస్తారు. అంతేకాదు..ఒమన్ కు తమ కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రవాసీయుడి జీతం RO300పైగా ఉండాలి. అలాగే ఇంటి కిరాయికి సంబంధించి అగ్రిమెంట్ ఉండాలి. దేశం దాటకుండానే విజిట్ వీసాను ఫ్యామిలీ వీసాగా బదిలి చేసుకునే వెసులుబాటు కల్పించటం ప్రవాసీయుల కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
తాజా వార్తలు
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు