కువైట్-ఇండియా మధ్య కొనసాగనున్న చార్టర్డ్ విమానాలు
- July 06, 2020
కువైట్ సిటీ:అల్ తాయెర్ గ్రూప్, కువైట్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు మరిన్ని చార్టర్ విమానాల్ని నడపనుంది. కువైట్ ఎయిర్ వేస్ విమానం ఢిల్లీకి 322 మంది ప్రయాణీకులతో కూడిన విమానాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపింది. మరో కువైట్ ఎయిర్వేస్ విమానం ముంబైకి 268 మంది ప్రయాణీకుల్ని తీసుకెళ్ళింది. అల్ తాయెర్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్ వీటిని ఏర్పాటు చేశాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక నిబంధనల కారణంగా చార్టర్డ్ విమానాల నిర్వహణ కొంత ఆలస్యమవుతోంది. కాగా, ముంబైకి విమానాన్ని నడిపే క్రమంలో చొరవ చూపిన ఆదిత్య ఠాక్రేకి లగ్జరీ ట్రావెల్స్ ఆపరేషన్స్ మేనేజర్ బాబీ థామస్ కృతజ్ఞతలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ వివేక్ గైక్వాడ్ అలాగే తహసిల్దార్ అయుబ్ రషీద్ తంబోలీకి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చార్టర్డ్ విమానాల్ని నడుపుతామని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







