TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్
- July 06, 2020
కరోనా మహమ్మారి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు TV ప్రొడ్యూసర్స్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. కరోనా నేపధ్యంలో షూటింగ్ ల సమయంలో భౌతిక దూరం పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలకు పెను సవాల్ గా మారిందని, స్వయంనియంత్రణ తోనే నిర్మూలన సాధ్యమని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ప్రెసిడెంట్ ప్రసాద్, వినోద్ బాల, ప్రభాకర్, వెంకటేశ్వర్ రావు, DY. చౌదరి, కిరణ్, అశోక్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







