ప్రపంచంలోనే అతి పెద్ద క్యామెల్ హాస్పిటల్
- July 07, 2020
రియాద్:ప్రపంచంలోనే అతి పెద్దదయిన క్యామెల్ హాస్పిటల్‌ని బురైదియాలో ప్రిన్స్ ఫైసల్ బిన్ మిషాల్ ప్రారంభించారు. కాగా, సలాం వెటరినరీ హాస్పిటల్‌లో కూడా అత్యాధునిక రీసెర్చ్ ఫెసిలిటీని క్యామెల్స్‌కి సంబంధించిన వైద్య పరిశోధనల నిమిత్తం ఏర్పాటు చేశారు. 100 మిలియన్ సౌదీ రియాల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించడం జరిగింది. 160 రకాల అనాలసిస్‌లు ఇక్కడ జరిగేలా లేబరేటరీలను రూపొందించారు. ఒకేసారి 4,000 క్యామెల్స్ రైడింగ్‌కి అకామడేట్ చేసే పెద్ద ప్రాంతంలో ఎమిర్ పర్యటించడం జరిగింది. యంగ్ క్యామెల్స్ యూనిట్, ఐసీయూ, సీటీ స్కాన్ యూనిట్ అలాగే సర్జికల్ ది¸యేటర్స్‌ని ఎమిర్ సందర్శించారు. మొత్తం 70,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ హాస్పిటల్‌ని ఏర్పాటు చేశారు. ఒక సీజన్‌లో ఏడు వరకు యంగ్ క్యామెల్స్‌ని ప్రొడ్యూస్ చేసే అవకాశం వుంటుందనీ, సంప్రదాయ పద్ధతుల్లో పెరిగే క్యామెల్స్ జీవించే వయసు 25 నుంచి 30 వరకూ వుంటుందని చెప్పారు.100 నుంచి 700 ఫెట్యుసెస్ ప్రొడక్షన్ దిశగా ఈ హాస్పిటల్ కృషి చేయనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







