మనామా:దాడి కేసులో ఐదుగురి అరెస్ట్‌

- July 07, 2020 , by Maagulf
మనామా:దాడి కేసులో ఐదుగురి అరెస్ట్‌

మనామా:ఓ యాక్సిడెంట్‌కి సంబంధించి ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితులు, సెక్యూరిటీ గార్డులపై దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్యాపిటల్‌ గవర్నరేట్‌ ప్రాసిక్యూషన్‌ హెడ్‌ అద్నాన్‌ ఫక్రో ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఈ ఘటన మొత్తం కన్పిస్తోంది. వీడియో ఆధారంగా నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితుల్ని ఆసియా జాతీయులుగా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరు నిందితుల అరెస్ట్‌ దిశగా ఇన్వెస్టిగేషన్‌ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com