మహిళను మోసం చేసిన వ్యక్తిపై విచారణ

- July 07, 2020 , by Maagulf
మహిళను మోసం చేసిన వ్యక్తిపై విచారణ

ఫుజైరా:ఓ మహిళను మోసం చేసిన కేసులో నిందితుడిపై విచారణ జరుగుతోంది. నిందితుడు ఫుజారియా సివిల్‌ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. మహిళను మోసం చేసి 1,100,000 దిర్హామ్ లు నిందితుడు దోచుకున్నట్లు కేసు నమోదు చేయబడింది. ఓ తన వద్ద ల్యాండ్‌ వుందని చెప్పి నిందితుడు మోసానికి పాల్పడ్డాడు. అద్దె రూపంలో మూడేళ్ళకు 200,000 చెల్లిస్తానని కూడా సదరు నిందితుడు నమ్మబలికాడు. ఈ మేరకు 40,000 దిర్హామ్ ల విలువైన చెక్కులను కూడా ఐదింటిని ఇచ్చాడు. అయితే, అక్కడ ఎలాంటి ప్రాజెక్టూ నిర్మించడంలేదని తాను తెలుసుకుని, సదరు వ్యక్తిని సంప్రదిస్తే, తనకు ఇచ్చిన చెక్కులను కూడా బ్యాంకులో వేయకుండా ఆపాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com