ప్రవాసీయులను ఆదుకున్న ఇన్ఫోసిస్
- July 07, 2020
బెంగళూరు: అసలే కరోనా కష్టకాలం.. అంతలో అమెరికాలో పని చేస్తున్న భారతీయులపై ట్రంప్ పిడుగు.. వీసా రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి అదెప్పుడు ఆమోదం పొందుతుందో తెలీదు. కొందరికి గడువు కూడా పూర్తైపోయింది. పోనీ తిరిగి ఇండియాకు వద్దామా అంటే విమానాల రాకపోకలు నిలిపేశారు. ఇలా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ సంస్ధ నడుంబిగించింది.
ప్రత్యేక విమానంలో 206 మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సంస్ధ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ బోడే లింక్డ్ ఇన్ ద్వారా వెల్లడించారు. ‘కోవిడ్–19 మన జీవితాలపై ఊహించని స్ధాయిలో ప్రభావం చూపింది. అమెరికాలో పని చేస్తున్న కొందరు ఇన్ఫోసిస్ ఉద్యోగుల వీసా గడువు ముగిసిపోయింది. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. అందుకే వారిని కుటుంబాలతో ఇండియాకు తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాం. వాళ్లు బెంగళూరుకు వచ్చేశారు కూడా. దీంతో కొన్ని వారాల డైలమాకు శుభం కార్డు పడింది’ అని బోడే రాసుకొచ్చారు.
ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక ప్రకారం కంపెనీకి అమెరికాలో 17,709 మంది ఉద్యోగులు ఉన్నారు. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో, చాలా మంది తమను తిరిగి స్వదేశానికి చేర్చాలని కంపెనీకి విన్నవించుకున్నారు. ఇండియాకు వచ్చిన 76 మంది ఉద్యోగులు హెచ్1బీ, ఎల్1 వీసాలతో కంపెనీ అమెరికా కార్యాలయంలో పని చేసేవారు. ట్రంప్ నిర్ణయంతో.. వీసాలు రెన్యువల్ కావనే భావనతోనే ఇన్ఫోసిస్ ఉద్యోగులను తిరిగి భారత్‌కు తెచ్చిందని సమాచారం.
ఉద్యోగులను ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారని తెలిసింది. ఆ తర్వాత చాలామంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు కంపెనీని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. భువనేశ్వర్‌లో వరదలు వచ్చినప్పుడు కూడా ఇన్ఫోసిస్ కంపెనీ చార్టర్ విమానంలో 500 మంది ఉద్యోగులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







