షూటింగ్ పూర్తి చేసుకున్న 'వూపిరి'

- February 03, 2016 , by Maagulf
షూటింగ్ పూర్తి చేసుకున్న 'వూపిరి'

అక్కినేని నాగార్జున, తమన్నా, కార్తీలు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న వూపిరి చిత్ర షూటింగ్పూర్తయింది. చిత్రానికి సంబంధించి అధిక భాగాన్ని ఫ్రాన్స్లోని పారిస్నగరంలో చిత్రీకరించారు. ప్రముఖ టాలీవుడ్దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నటుడు కార్తీ తన ఫేస్బుక్ఖాతా ద్వారా వెల్లడించారు. పీవీపీ సినిమా బ్యానర్పై తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com