బంగ్లాదేశీ ఎంపీ కువైటీ నేషనాలిటీ రూమర్స్‌కి ఖండన

- July 10, 2020 , by Maagulf
బంగ్లాదేశీ ఎంపీ కువైటీ నేషనాలిటీ రూమర్స్‌కి ఖండన

కువైట్ సిటీ:బంగ్లాదేశీ పార్లమెంటేరియన్‌, కువైటీ సిటిజన్‌షిప్‌ పొందారంటూ వస్తున్న వార్తల్ని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఖండించింది. అధికారిక రికార్డుల  ప్రకారం, బంగ్లాదేశీ నిందితుడు, ఆ దేశానికి చెందిన పౌరుడు మాత్రమేననీ, అతనికి కువైటీ సిటిజన్‌షిప్‌ లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశీ న్యూస్‌ పేపర్స్‌లో నిందితుడు, కువైటీ సిటిజన్‌షిప్‌ పొందినట్లు వార్తలు రావడంపై మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ స్పందించింది. ‘ఆ వ్యక్తి కువైటీ పౌరుడా.? కాదా.? అన్నది తెలియదు. ఒకవేళ కువైటీ పౌరుడైతే, ఆ సీటు ఖాళీ అవుతుంది’ అని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా పార్లమెంటులో చెప్పారు. బంగ్లాదేశీ పార్లమెంటేరియన్‌ అయిన ఓ వ్యక్తికి చెందిన బ్యాంక్‌ అకౌంట్‌ (5 మిలియన్‌ డాలర్ల విలువైనది) సీజ్‌ చేసింది కువైట్‌ ఇటీవలే. నిందితుడు, హ్యామన్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితుడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com