మస్కట్: ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్న షాపుల సీజ్

- July 10, 2020 , by Maagulf
మస్కట్: ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్న షాపుల సీజ్

కరోనా నేపథ్యంలో కొందరు వ్యాపారులు ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. అసలు ధరల కన్నా..రెట్టింపు ధరలకు సరుకులు అమ్ముతున్నారు. అలాంటి వారిపై వినియోగదారుల హక్కుల పరిరక్షణ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ ప్రాంతంలోని బర్కలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్నట్లు తనిఖీల్లో రుజువు కావటంతో ఓ షాపును సీజ్ చేశారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు తాము చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని, ఎవరైనా వ్యాపారులు ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రజలను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com