ఇండస్ట్రియల్‌ ఏరియాలో అబాండన్డ్‌ వాహనాల తొలగింపు

- July 10, 2020 , by Maagulf
ఇండస్ట్రియల్‌ ఏరియాలో అబాండన్డ్‌ వాహనాల తొలగింపు

దోహా:అబాండన్డ్‌ వాహనాల తొలగింపుకు సంబంధించి అగ్రెసివ్‌ క్యాంపెయిన్‌ని ఇండస్ట్రియల్‌ ఏరియా నుంచి ప్రారంభించారు. పబ్లిక్‌ క్లీన్లీనెస్‌ అండ్‌ మెకానికల్‌ ఎక్విప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్స్‌, దోహా మునిసిపాలిటీ మరియు సెక్యూరిటీ అథారిటీస్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మినిస్టీరియల్‌ డెసిషన్‌ 178 - 2020 ప్రకారం, ఆయా ప్రాంతాల ‘వ్యూ’ని ఇబ్బందికరంగా మార్చే అబాండన్డ్‌ వాహనాల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ క్లీన్లినెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మొహమ్మద్‌ ఫరాజ్‌ అల్‌ కుబైసి మాట్లాడుతూ, గురువారం ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌, పూర్తిగా వాహనాలు తొలగించేవరకు కొనసాగుతుందని చెప్పారు. గత ఏడాది 17,000 వాహనాల్ని ఇండస్ట్రియల్‌ ఏరియా నుంచి తొలగించారు.

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com