వలసదారుల కోటా బిల్లుపై కువైట్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు

- July 10, 2020 , by Maagulf
వలసదారుల కోటా బిల్లుపై కువైట్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు

కువైట్ సిటీ:కువైట్‌ ఫారిన్‌ మినిస్టర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌కి భారత ప్రభుత్వం ‘వలసదారుల కోటా బిల్లు’ విషయమై తమ అభ్యంతరాల్ని వివరించడం జరిగింది. కువైట్‌తో భారత్‌కి సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఈ నేపథ్యంలో కువైట్‌కి తమ అభ్యంతరాల్ని తెలిపామని ఎంఈఏ అధికార ప్రతినిధి¸ అనురాగ్‌ శ్రీవాత్సవ చెప్పారు. వర్చువల్‌ ప్రెస్‌ బ్రీఫింగ్‌లో ఈ విషయాన్ని అనురాగ్‌ వెల్లడించారు. కువైట్‌ నేషనల్‌ అసెంబ్లీ లీగల్‌ మరియు లెజిస్లేటివ్‌ కమిటీ, వలసదారుల కోటా బిల్లుకి సంబంధించిన డ్రాఫ్ట్‌ని ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం సుమారు 8 లక్షల మంది భారతీయులు కువైట్‌ని వీడాల్సి వుంటుంది. కువైట్‌ జనాభాలో 15 శాతానికి మించి భారతీయులు వుండడానికి వీల్లేదన్నది ఈ బిల్లు సారాంశం. కువైట్‌లో భారతీయులు అత్యధిక శాతం మంది వున్నారు. కువైట్‌కి సంబంధించి 4.3 మిలియన్ల జనాభాలో భారతీయుల వాటా 1.45గా వుంది. మొత్తంగా వలసదారులు 3 మిలియన్లుగా వున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com