మస్కట్:కోవిడ్ కు ఔషధం కనిపెట్టామని అసత్యప్రచారం చేస్తే మూడేళ్ల జైలు శిక్ష

- July 12, 2020 , by Maagulf
మస్కట్:కోవిడ్ కు ఔషధం కనిపెట్టామని అసత్యప్రచారం చేస్తే మూడేళ్ల జైలు శిక్ష

మస్కట్:కోవిడ్ 19 వ్యాప్తి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అయితే..ఈ వైరస్ సంక్షోభ కాలంలో ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీగాళ్లు క్యాష్ చేసుకునేందుకు నకిలీ మాత్రలతో ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. కరోనా నివారణకు తమ దగ్గర దివ్యమైన ఔషధం ఉందని ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు ఔషధ సంస్థలు కూడా తాము మందును కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఒమన్ ప్రభుత్వం నకిలీ ప్రకటనలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. కరోనా నివారణకు మందులు కనిపెట్టామని ఎవరైనా క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఒమన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రజాహితం కాదని ఒమన్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com